సహనం, సాహసం ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ తో జూమ్ సమావేశంలో డా.పసుపులేటి హరిప్రసాద్

జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ ఆధ్వర్యంలో సురేష్ వరికూటి అధ్యక్షతన చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు మరియు జనసేన పార్టీ పిఏసి సభ్యులు డా.పసుపులేటి హరిప్రసాద్ తో ఆదివారం జె.ఎస్.పి గ్లోబల్ టీం జూమ్ సమావేశం నిర్వహించడం జరిగింది. తమ తమ దేశాల నుండి ఒక్కొక్కరిగా సేవలు అందించడం కంటే అందరూ సంఘటితమై ప్రపంచ వ్యాప్తంగా అన్ని టీంలు కలిసి ఒక్క టీంగా వెళ్ళాలి అనే ముఖ్య లక్ష్యంతో ఏర్పడినటువంటి “జె.ఎస్.పి గ్లోబల్ టీం” నుండి వివిధ దేశాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నటువంటి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు మరియు జనసేన పార్టీ పిఏసి సభ్యులు డా.పసుపులేటి హరిప్రసాద్ తో వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎన్నారై జనసేన నాయకులు తమ తమ నియోజకవర్గాలలోని సమస్యలపై చర్చించడం జరిగింది. సుమరు 3 గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి మరియు జనసేన అధినేత తలపెట్టిన కార్యక్రమాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనే అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అద్యక్షులు మరియు జనసేన పార్టీ పిఏసి సభ్యులు డా.పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహనం, సాహసం ఉన్న వ్యక్తి అని, పవన్ కళ్యాణ్ రాష్ట్ర నాయకుడు కాదని ఆయన ఒక జాతీయ నాయకుడని అభివర్ణించారు. ఈ సందర్భంగా ఇంచార్జుల నియామకం గురించి మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో జనసేన పార్టీ అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని, దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ కార్యాచరణ చేస్తున్నారని, ఇప్పటివరకు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను ప్రకటించని నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక సర్వే నిర్వహిస్తున్నారని కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన అధినేత తలపెట్టిన ‘నా సేన కోసం నా వంతు ‘ ముందుకు తీసుకువెళ్ళడంలో అందరూ తమవంతు కృషి చేయాలని సాధ్యమయినంత ఎక్కువ మందిని భాగస్వామ్యులను చేయాలని ఆయన కోరడం జరిగింది. ‘నా సేన కోసం నా వంతు ‘ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ జనసేన పార్టీకి చాలా బలమైన కార్యకర్తలు కావాలని తెలియజేశారు. ఇతర దేశాలలో స్థిరపడినటువంటి ఎన్నారై జనసైనికులు మీ యొక్క సొంత నియోజకవర్గ జనసైనికులను మీ బాధ్యతగా ముందుకు నడిపించాలని సూచిస్తూ పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తిత్వం ఉన్నవారని, భవిష్యత్తు జనసేనదే అని తెలియజేసారు. సమావేశంలో పాల్గొన్న ఎన్నారై విద్యార్ధులు జనసేన తరపున విద్యార్ధి సంఘాలను ఏర్పాటు చేయాలని కోరగా దానికి సమాధానంగా అధ్యక్షుల వారు ఆ దిశగా కసరత్తులు చేస్తున్నారని, జనసేన పార్టీ త్వరలో విద్యార్ధి సంఘాలను మరియు కార్మిక సంఘాలను ప్రకటిస్తుందని తెలిపారు. ఈ సమావేశాలు నిర్వహించడం కోసం ఎంతో కృషి చేస్తున్న వరికూటి సురేష్ మరియు అమీర్ ఖాన్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు, సమావేశ నిర్వాహకులను ప్రశంసించడం జరిగింది. ఈ సమావేశంలో
యుఏఈ నుండి పాపోలు అప్పారావు, అప్పాజీ, రవి కుమార్, రవి వర్మ, శ్రీహరి, పెనుమాల జాన్ బాబు
మలేషియా నుండి డా.విశ్వేశ్వర రావు పసుపులేటి, ఇమ్మడి పుల్లారావు
యుకె నుండి శ్రీనాధ్ వట్టికూటి, రాజేష్ ఆచంట
కంబోడియా నుండి నవీన్ నవబోతు
సింగపూర్ నుండి సాయిరామ్, వంశీ గుంటూరు
జర్మనీ నుండి సుధాకర్ వరికూటి, అఖిల్ ఆవుల, బాల సుబ్రహ్మణ్యం అన్నమేటి, దాసరి రంగ
యుఎస్ నుండి విద్యార్థి నాయకులు సాయికృష్ణ తేజ
సౌత్ కొరియా నుండి డా.నవీన్ కుమార్
ఐర్లాండ్ నుండి రాజేంద్ర గాదె
సౌది అరేబియా నుండి షాహెద్
కెనడా నుండి నరేష్ శిరిగినీడి
కువైట్ నుండి విజయ్ గౌడ్
ఇండియా నుండి రత్న పిల్లా, కీర్తన, ప్రభావతి వసంతాల మరికొంత మంది ఎన్నారై జనసైనికులు పాల్గొన్నారు.