తిగుటి పండును పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం: ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పడ గ్రామానికి చెందిన తిగుటి పండు గత కొంతకాలంగా అనారోగ్యంతో కాలికి జరిగిన ఆపరేషన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. స్థానిక జనసైనికుల ద్వారా విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ గురువారం తిగుటి పండు ను తన స్వగృహం నందు పరామర్శించి తన ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని తగిన సలహాలు సూచనలు అందించడం జరిగింది. వారికి వైద్య ఖర్చుల నిమిత్తం 8000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర మత్స్కార నాయకులు కంబాల దాసు, వెన్నపు చక్రధర్ రావు, మత్స్యకార నాయకులు పల్లెటి బాపన్న దొర, మైలపల్లి రవి, సోదే రవికిరణ్, పల్లేటి జాన్సన్, పలివెల్ల నానీబాబు, పెనుపోతుల వీరబాబు, మత్స్యకార నాయకులు వంకకొండబాబు, గేదెల వెంకటరావు ఎక్స్ సర్పంచ్ గరగా సత్యనందరావు, బొజ్జ గోపికృష్ణ, దుడ్డు రాంబాబు, వీరారెడ్డి అమర్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.