సెర్ప్ ఉద్యోగుల దీక్షకు మద్దతు తెలిపిన డా.వంపూరు గంగులయ్య

పాడేరు, గ్రామీణ పేదరిక నిర్మూలన సెర్ప్ ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఎన్నో ఏళ్లుగా ఉద్యోగాలు చేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు నెరవేరుస్తూ ఈరోజు గ్రామీణ ప్రాంత మహిళలకు ఎంతో సేవలు అందిస్తున్న ఉద్యోగుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి. వైసీపీ ప్రభుత్వంలో అన్ని శాఖాల ఉద్యోగులు నిరహారదీక్షాలు, ర్యాలీలు, ధర్నాలు పేరున ఇవాళ రోడ్డెక్కుతున్నారు కారణం ఇవాళ రాష్ట్రానికి చేతగాని ముఖ్యమంత్రి కారణం వైసీపీ పాలనలో అనేక వర్గాల ప్రజలు అనేక శాఖల ఉద్యోగులు వారి ఉద్యోగ భద్రతకు భరోసాలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం కాపాడుకోవడానికి అనేకమైన కుళ్లు కుతంత్రాలు రాజకీయాలు చేయడమే తప్పితే ప్రజల కోసం నిత్యం శ్రమించే ఉద్యోగుల భద్రత వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఏమాత్రం ఆలోచన చేసిన దాఖలాలు లేవు ఏదైనా అనుకుంటే ఉద్యోగులపై రకరకాల చట్టాలు ప్రయోగించి భయభ్రాంతులకు గురిచేయడం వైసీపీ ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనం.అందుకే మేము జనసేన తరుపున సెర్ప్ ఉద్యోగులకు వారి ఉద్యమానికి బేషరతుగా మద్దతు తెలుపుతున్నామన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను కచ్చితంగా నెరవేర్చేందుకు ప్రభుత్వం అంగీకరించాలి సత్వరమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. జనసేనపార్టీ నాయకులు సుర్ల సుమన్, మజ్జి సత్యనారాయణ, ముదిలి సుబ్బారావు, తదితర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.