రైతు ఆపద్బాంధవుడు పవన్ కళ్యాణ్.. రైతు కోసం జనసేన కార్యక్రమంలో డా.యుగంధర్

  • జనసేన ప్రభుత్వంలో ఆకలి కేకలు ఉండవు
  • ప్రభుత్వం వచ్చాక రైతు ఆత్మహత్యలు అసలే ఉండవు
  • ఇది జనసేన మాట
  • మట్టి నుండి కస్తూరి పరిమళాన్ని తీసే శక్తి రైతులకు మాత్రమే ఉంది
  • వారి చేత కన్నీరు పెట్టిస్తున్న పాలకులకు చేటు తప్పదు
  • పద్మ సరస్సులో రైతు కోసం జనసేన కార్యక్రమం
  • జనసేన ఇంచార్జి డా.యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం, పద్మ సరస్సు గ్రామంలో రైతు కోసం జనసేన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం ఇంచార్జి డా. యుగంధర్ పొన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న రైతులకు రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. డా. యుగంధర్ మాట్లాడుతూ.. వ్యవసాయం ప్రతిక్షణం ఎగిసిపడే కెరటం, ప్రపంచానికి సాయం చేయడానికి ప్రతిసారి పడి లేస్తుంది, అందుకే అది అమృతం.. అందరికీ రైతన్న ఆదర్శం అని తెలిపారు. వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ ఉంది. ప్రపంచానికి కల్చర్ని, సాయం చేసే గుణాన్ని నేర్పిన ఒకే ఒక్క స్ఫూర్తి రైతన్న అని కొనియాడారు. ఈ ప్రపంచంలో అందరూ మట్టిని మట్టిలా చూస్తే, కేవలం రైతు మాత్రమే మట్టిని బంగారంలా బంగారం పండిస్తాడని తెలిపారు. మనం నిలబడటానికి ఆధారం అయిన నేల నుంచి సిరులు పండించే శ్రామికుడు రైతు. మనం జీవించడానికి అవసరమైన శక్తిని ఇచ్చే ఆహారాన్ని సమకూర్చే అన్నదాత రైతు. మనం శ్వాసించడానికి ప్రాణ వాయువును ఇచ్చే మొక్కలను పెంచే ప్రకృతి పుత్రుడు రైతని తెలియజేసారు. ప్రకృతి విలయాలకు ఎదురొడ్డి పంట సాగు చేసే సైనికుడు రైతు. పక్షులను, పశువులను మచ్చిక చేసుకుని కాపాడే జంతు ప్రేమికుడు రైతు. వ్యవసాయం తన వృత్తి, తోటి మనిషికి సాయం తన ప్రవృత్తని కొనియాడారు. దేశానికి అన్నం పెట్టడం కోసం అన్నపానీయాలు మరిచిపోయి, అహర్నిశలు కృషి చేసే రైతన్నకు వందనాలని తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతు, నేడు ఆకలితో అలమటిస్తున్నాడు. ప్రజల ఆకలి తీర్చే వ్యవసాయదారుడు, నేడు పరాయి కుతంత్రాలకు బలి అవుతున్నాడు. పంటనే నమ్ముకున్ను కృషివలుడు, నేడు ప్రకృతి విలయాలకు విలవిలలాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యోగికి సెలవొచ్చినా కంపెనీలకి తాళం పడినా ప్రభుత్వాలే స్తంభించినా ఆగిన ప్రపంచాన్ని నడిపించేందుకు పరిగెత్తేవాడే రైతన్న అని సంతోషం వ్యక్తం చేసారు.

దేశానికి రైతు వెన్నుముక!! అందుకేనా లాఠీలతో, ఇప్పుడు కరెంట్ చార్జీలతో విరగ్గొట్టాలని చూస్తున్నారని ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతు పద్బాంధవుడు పవన్ కళ్యాణ్ అని, జనసేన ప్రభుత్వంలో ఆకలి కేకలు ఉండవని, ప్రభుత్వం వచ్చాక రైతు ఆత్మహత్యలు ఉండవని, ఇది జనసేన మాట అని వాగ్దానం చేసారు. మట్టి నుండి కస్తూరి పరిమళాన్ని తీసే శక్తి రైతులకు మాత్రమే ఉందని, వారి చేత కన్నీరు పెట్టిస్తున్న పాలకులకు చేటు తప్పదని హెచ్చరించారు. ఈ సందర్బంగా జనసేన మేనిఫెస్టో పొందుపరచిన 60 సంవత్సరాలకు పైబడిన రైతులకు ఐదు వేలు పింఛను పథకాన్ని ముగ్గురు రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున ఇచ్చి, వారిని సత్కరించి, మేనిఫెస్టో ను వివరించారు. కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రమేనని ఘంటాపథంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులుశోభన్ బాబు, పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, ఎస్ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, ఉపాధ్యక్షులు నరేష్, విజయ్, సురేష్ రెడ్డి, లోకేష్, వెంకటేష్, చంద్ర శేఖర్, సెల్వి, ప్రధాన కార్యదర్శులు చంద్ర మౌళి, వెంకటేష్, దేవేంద్ర, హరీష్, అవినాష్, నరేష్, మండల కార్యదర్శిలు చిరంజీవి, గంగయ్య, హరీష్, అజిత్, శివ, బాలాజీ, యుగంధర్ రెడ్డి, మండల బూత్ కన్వీనర్ అన్నామలై, వెదురుకుప్ప మండల ఉపాధ్యక్షులు సతీష్, మండల కార్యదర్శి హిమగిరి, ఎస్ఆర్ పురం మండల ఐటీ కోఆర్డినేటర్ మురుగేష్, జిల్లా కార్యదర్శి భాను ప్రసాద్, సంయుక్త కార్యదర్శి రాఘవ, ఆరు మండలాల జనసైనికులు పాల్గొన్నారు.