సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ

విజయవాడ ఇంద్రకీలాద్రి పై జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా జరుగుతున్నాయి. ఈరోజు 6 వ రోజు… ఆశ్వయుజ శుద్ధ సప్తమి మంగళవారం ఎంతో విశిష్టమైన రోజు. అమ్మవారు జన్మించిన మూలా నక్షత్రం కావడంతో సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలు జరిగే అన్ని రోజులలో ప్రత్యేకత సంతరించుకునేది కూడా మూల నక్షత్రంనాడే. రాష్ట్ర ప్రభుత్వం తరుపున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు మధ్నాహ్నం 3 గంటలకు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||

సరస్వతీ దేవి అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దేవి శరన్నవరాత్రులలో మూల నక్షత్రంకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.. ఎందుకంటే అమ్మవారు జన్మించిన నక్షత్రం మూలా.. నేడు 6 వ రోజు అమ్మవారు సరస్వతి దేవిగా బంగారు వీణ ధరించి భక్తులకు దర్శనమిస్తున్నారు..మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి గా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన దుర్గాదేవి తన నిజ స్వరూపంతో సాక్షాత్కారింప చేయడమే శ్రీ సరస్వతి దేవి అలంకారం యొక్క విశిష్టత.

సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః ||

విద్యార్దినీ విద్యార్దులకు చదువుల తల్లి సరస్వతీ అంటే అమితమైన ఇష్టం… అనుగ్రహం కోరిన వారికి నిర్మలమైన దరహాసంతో సద్విద్యను శ్రీ సరస్వతి దేవి ప్రసాదిస్తుంది..మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు పుణ్యదినాలుగా బావించి దుర్గాదేవిని ఆరాధిస్తారు. భక్తుల అజ్హ్నాన్ని ప్రారద్రోలి జ్ఞాన జ్యోతి ని వెలిగించే జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి ..సరస్వతి దేవి విద్యాభ్యుదయప్రదాయకమని విశ్వాసం.