బృగుబండ గ్రామంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం

సత్తెనపల్లి రూరల్ మండలం, బృగుబండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ మరియు శ్రీమతి మేఘన శ్రీకృష్ణదేవరాయలు, జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామస్తులు పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తప్పెట్లతో స్వాగతం పలికారు. గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేసి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటెయ్యాలని కన్నా మరియు జనసేన పార్టీ నాయకులు బొర్రా అప్పారావు అభ్యర్థించారు.