ప్రజాస్వామ్య పరిరక్షణ ఎన్డీఏ కూటమి ముఖ్య లక్ష్యం

తిరుపతి: బిసి గౌడ్ సంఘ నాయకుల ఆత్మీయ సమావేశంలో బిజెపి, జనసేన, టిడిపి బలపరిచిన బిజెపి ఎంపీ అభ్యర్థి వర ప్రసాద్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరని శ్రీనివాసులు కుమారుడు మదన్, నరసింహ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం జనసేన, టిడిపి, బిజెపి పొత్తు పెట్టుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రజలు వ్యతిరేకత మొదలయిదున్నారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయనీకుండా అడ్డుకున్నారు. ఆ ఎన్నికల్లో వైసిపి నైతికంగా ఓడిపోయింది అన్నారు. జనసేన టిడిపి బిజెపి పోటీ చేసి ఉంటే వైసిపి శక్తి ఎంతో జగన్మోహన్ రెడ్డికి అర్ధం అయ్యివుంటుంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ, యువతకు ఉద్యోగాలు, లేకుండా పోయాయి అన్నారు, జగన్ అధికారం మీద ఉన్న శ్రద్ధ పాలనపై లేదన్నారు మళ్లీ సీఎం అవడం కోసం ధనం, దౌర్జన్యాలను ఆయుధాలుగా మార్చుకున్నారు. ప్రకృతి వనరులతో పాటు రాష్ట్రాన్ని లూటీ చేయడమే తన లక్ష్యంగా మార్చుకున్నాడు. ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగ ఓట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మూడు పార్టీలు సమన్వెంతో పనిచేసి జగన్ రెడ్డిని ఇంటికి పంపాలన్నారు. బీసీల తోడ్పాటు చాలా అవసరమని అందరికీ తెలియజేశారు. జనసేన టిడిపి బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ భవన్, కాపు భవన్, జగజీవన్ రామ్ భవన్ తిరుపతి ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఉమ్మడి ప్రభుత్వం ఉంటుంది అని తెలియజేశారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరని శ్రీనివాసులు గారి గుర్తు వరుస నెంబర్ 3 గాజు గ్లాస్ మీద, బిజెపి ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ రావు గారు వరుస నెంబరు 4 కమలం గుర్తు మీద ఓటు వేసి జనసేన బిజెపి గెలుపుకు తిరుపతి ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాము.