విద్యుత్ చార్జీలను విద్యుత్ కోతలను వెంటనే తగ్గించాలి

  • జనసేన పార్టీ పామిడి మండల అధ్యక్షులు యం ధనుంజయ

గుంతకల్: విద్యుత్ చార్జీల వల్ల, విద్యుత్ కోతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన చార్జీల వల్ల ప్రభుత్వ పథకాలు రద్దవుతున్నాయి, ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలను పూర్తిగా తగ్గిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేడు సర్ చార్జీల పేరుతో వరుసగా కరెంటు చార్జీలను పెంచేస్తున్నారు, పెరిగిన విద్యుత్ చార్జీలపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉంది దీనిని దృష్టిలో ఉంచుకొని వెంటనే విద్యుత్ చార్జీలను తగ్గించాలని, విద్యుత్ కోతలను తగ్గించాలని, అలాగే పామిడి పట్టణంలో కరెంటు స్తంభాల దుస్థితిని ఒకసారి పరిశీలించి శిథిలావస్థకు చేరుకున్న స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి రామన్న రోజుల్లో ప్రమాదాలు జరగకుండా చూడాలని జనసేన పార్టీ పామిడి మండలం తరపున పామిడి మండలం కరెంట్ ఏఈ గారికి వినతి పత్రాన్ని అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పామిడి మండల నాయకులు ఖాజావలి, వేణుగోపాల్, అనిల్ కుమార్, జగదీష్, రాము, అబ్దుల్, భాస్కర్ గౌడ్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.