లోతుపాలెం గ్రామంలో జనసేనలో చేరికలు

రంపచోడవరం నియోజకవర్గం: దేవిపట్నం మండలం, లోతుపాలెం గ్రామంలో సీనియర్ నాయకులు కుంజం శ్రీనివాస్ దొర సమక్షంలో మండల అధ్యక్షులు చారపు వెంకటరాయుడు అధ్యక్షతన ఆధ్వర్యంలో గ్రామస్థులు వెంకన్న దొర, పృద్వి దొర, వెంకటేష్ దొర, శరత్ చంద్ర దొర, దుర్గా ప్రసాద్ దొర, సురేష్ దొర, రాజన్న దొర, శ్రీనివాసు దొర, సంతోష్ దొర, వెంకన్న దొర, కె వినయ్ దొర, పొట్టిదోర, నరసింహదోర, పి వెంకన్న దొర జనసేన పార్టీ కండువా వేసుకుని పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిథులుగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లీగల్ సెల్ ఉపాధ్యక్షులు కాకిస్వామి హాజరయ్యారు. జనసేన పార్టీ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని బలోపేతం నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోమండల వైఎస్ ప్రెసిడెంట్ కర్రీ మహేష్, సీనియర్ నాయకులు కట్టమూరి వీరబాబు రాగల సురేష్, విశ్వ అడ్డతీగల, గంగవరం మండల కన్వీనర్ కుంజం సిద్దు ఈ కార్యక్రమంలో పాల్గొనటం జరిగింది.