ప్రతి ఒక్కరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోండి

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి, తిరుపతి ఇన్చార్జి కిరణ్ రాయల్ నాయకులకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం తొలిదశలో సభ్యత్వం తీసుకున్న ప్రతీ జనసైనికులు, వీరమహిళలు క్రియాశీలక సభ్యత్వం రెన్యూవల్ చేయించుకోవాల్సిందిగా మనవి చేస్తూ, సభ్యత్వం రెన్యూవల్ చేయించుకోవడం ద్వారా ప్రమాదం, 5 లక్షల రపాయలు జీవిత భీమాసేవలు నిరంతరాయంగా పొందగలరని అదేవిధంగా 50 వేల రూపాయల ప్రమాదభీమా వర్తిస్తుందని, కొత్త వారు ఇప్పుడు మీకు తిరుపతి నందు అందుబాటులో సభ్యత్వ నమోదు చేస్తున్న వారి వద్ద చేయించుకోవాలని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి, రాష్ట్ర నాయకులు, పగడాల మురళి, కత్తి మమత, వనజ, జిల్లా నాయకులు రాజేష్ యాదవ్, బాబ్జీ, హేమ కుమార్, కీర్తన, మరియు సుమన్ బాబు, అమృత, మనోజ్, బాల, చరణ్, కిశోర్, సాయి దేవ్, తదితరులు పాల్గొన్నారు.