అంబేద్కర్ ఆశయాలసాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: గొలకోటి విజయలక్ష్మి

కోనసీమ జిల్లా: అమలాపురం పురపాలక 9వార్డ్ జనసేన కౌన్సిలర్ గొలకోటి విజయ లక్ష్మి వార్డ్ పరిధిలో స్తంభాల మెరకలో డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ 133వ జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఫోల్గొన్నారు. డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ విగ్రహనికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని, అంబేద్కర్ బాల్యం విద్యాభ్యాసం చదువు నాటి పరిస్థితులు మరియు నేటి పరిస్థితుల గురించి వివరించారు. ఆనాడు రాజ్యాంగ నిర్మాతగా డాక్టర్ బీ ఆర్ అంబెడ్కర్ రాజ్యాంగంలో రాసిన శాసనాలు చట్టం రూపంలో నేడు ప్రజాస్వామ్యంలో అమలు జరుగుతున్నాయన్నారు. అందరూ అంబెడ్కర్ ఆశయాలుస్ఫూర్తిగా తీసుకో వాలి అని కోరారు. ఈ కార్యక్రమలో గొలకోటి వాసు కుంచె రమేష్ గొల్లపల్లి బాబీ కడిమి అన్నవరం, యు. సత్యనారాయణ, ఫాల్గొన్నారు.