భవ్య శ్రీ కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి

  • భవితను కోల్పోయిన భవ్యశ్రీ
  • శోధించి, చేదించి దోషులకు ఉరిశిక్ష వేయాలి
  • అధికారులకు అలసత్వం పనికిరాదు
  • స్థానిక ఎస్సైని ఇన్వెస్టిగేషన్ నుండి తప్పించాలి
  • ఉపముఖ్యమంత్రి ఇలాకాలో ఏమి జరుతుందో ఉప ముఖ్యమంత్రికే తెలియదు
  • నారాయణస్వామి ఎందుకు స్పందించలేదు?
  • భవ్యశ్రీ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి
  • కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలి
  • జనసేన ఇంచార్జ్ యుగంధర్ డిమాండ్

గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం: పెనుమూరు మండలం, కావూరు వారి పల్లి పంచాయితీ, ఠాణా వేణుగోపాలపురం గ్రామంలో ఒక ఆడబిడ్డ, భవితను కోల్పోయిన భవ్యశ్రీ అనుమానాస్పద మృతిని శోధించి, చేదించి దోషులకు ఉరిశిక్ష పడేటట్లు చేయాలని జనసేన నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులకు అలసత్వం పనికిరాదని, స్థానిక ఎస్సైని ఇన్వెస్టిగేషన్ నుండి తప్పించాలని కోరారు. ఉపముఖ్యమంత్రి ఇలాకాలో ఏమి జరుతుందో ఉప ముఖ్యమంత్రికే తెలియదని, నారాయణస్వామి ఎందుకు స్పందించలేదని ఎద్దేవా చేశారు. 100 ఓట్లు ఉన్న గ్రామమైనా, లేదా 200 ఓట్లు ఉన్న గ్రామమైనా ఉండి ఉంటే, ఈపాటికి ఆగమేఘాల మీద దస్త్రం కదిలేది, కానీ ఇక్కడ కేవలం 15 కుటుంబాలే కదా నివసిస్తూ ఉండేది, అందుకని ఉపముఖ్యమంత్రి చొరవ ఇందులో ఏ మాత్రం ఉండదని తెలిపారు. ఆయనకు ఓటు కావాలి, ఆయనకి ఎమ్మెల్యే సీటు కావాలి, కానీ ప్రజలకు మాత్రం న్యాయం చేయరని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భవ్య శ్రీ కుటుంబానికి కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. భవ్యశ్రీ కి సంబంధించిన వివరాలన్నిటిని జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ద్వారా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు చేరవేసామని, ఈ విషయంలో జనసేన అండ ఈ కుటుంబానికి ఎల్లవేళలా ఉంటుందని, అవసరమైతే మా అధ్యక్షులు వెంటనే స్పందిస్తారని తెలియజేశారు. ఈ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు జనసేన విరోచితమైన పోరాటం చేస్తుందని, ప్రజా సంఘాలు, పౌర సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, రాజకీయాలకతీతంగా అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పెనుమూరు మండల అధ్యక్షులు శ్రీనివాసులు, యువజన అధ్యక్షులు గురు ప్రసాద్, మండల కార్యదర్శి శేఖర్, జిల్లా కార్యదర్శిలు, భాను ప్రసాద్, యశ్వంత్, నియోజకవర్గం కార్యదర్శి వెంకటేష్, గంగాధర్ నెల్లూరు మండల ఉపాధ్యక్షులు రషీద్, చిత్తూరు నగర ఉపాధ్యక్షులు రూపేష్, జనసేన నాయకులు చిన్నబాబు, పవన్, యశ్వంత్ పాల్గొన్నారు.