సభాపతి ఊర్లో ముంపుకి గురువుతున్న రైతు భరోసా కేంద్రం

ఆమదాలవలస, కలివరం గ్రామంలో పర్యటించిన ఆమదాలవలస జనసేన పార్టీ ఇంఛార్జి రామ్మోహన్. నాగావళి నది ఎక్కువ రావడంతో నది ఒడ్డున కట్టిన రైతు భరోసా కేంద్రం కోతకు గురైంది. రామ్మోహన్ మాట్లాడుతూ… గత సంవత్సరం నాగావళి నది ఒడ్డున కట్టిన ఆరోగ్య కేంద్రం పునాదులు గోడలు కూలిపోవడం జరిగింది. ఆయన ఈ నాయకులకి ఏమి పట్టనట్టు దాని పక్కనే రైతు భరోసా కేంద్రం నిర్మించడం జరిగింది. దాదాపగా 35 లక్షలు ప్రజల డబ్బులు వృధా అయ్యిందని మండిపడ్డారు. ఇప్పుడు ఆ రైతు భరోసా కేంద్రం కూడా కోతకు గురైంది. ఇక్కడ కట్టడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి కలెక్టర్ మరియు స్థానిక ఎమ్మెల్యే (సభాపతి), ఎమ్మార్వో మరియు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే నది ఒడ్డున కరకట్టతో పాటు రాయి వేయాలని సూచించారు. లేదంటే ఎప్పటికీ అయిన ప్రమాదం జరగవచ్చుని ఆవేదన వ్యక్తం చేశారు. కలివరం ప్రజలకి బాయందోళనతో ఉన్నారు. కరకట్ట కట్టే వరకు పోరాడుతం అని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస జనసేన నాయకులు రాజశేఖర్, బాల మురళి, పైడి ధనుంజయ్, గౌతం మరియు స్థానికలు మరియు కార్యకర్తలు జనసైనుకులు పాల్గొన్నారు.