వైసిపి నాయకులపై మండిపడిన పితాని వెంకటేష్

పాలకొల్లు నియోజకవర్గం పోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పితాని వెంకటేష్, వైసిపి అధినాయకుడు, నాయకులు, మీడియా ముందుకు వచ్చి జనసేన ధినేత పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు ప్యాకేజ్ అని అనేముందు మూడు సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు అవినీతి గురించి పుస్తకం రిలీజ్ చేశారు, మీరు అధికారంలోకి వచ్చి మూడున్నర సంవత్సరాలు అయినా కూడా ఆయన మీద కేసు పెట్టి ఎందుకు అరెస్ట్ చేయలేదు. ఎవరు లాలూచీ రాజకీయాలు చేస్తున్నారు ఎవరు ప్యాకేజీ తీసుకున్నారు జనాలకి అర్థం అవుతుంది. మీరు నిజాన్ని మసిపూసి మారేడు కాయ చేసినంత మాత్రాన జనాలు నమ్మే స్థితిలో లేరు, మీ దొంగ మాటలు వినే స్థితిలో లేరు. ఇంకా బూతులు గురించి మాట్లాడాల్సి వస్తే, బూతులు తిట్టే వారికి సపరేట్ మంత్రిత్వ శాఖ ఉంది మీ పార్టీలో, మీరా మాట్లాడేది బూతులు గురించి. పవన్ కళ్యాణ్ చెప్పు చూపిస్తే తప్పు అని విమర్శించిన మీరు జిప్పులు విప్పితే తప్పని మీ నాయకులు చేసింది తప్పు అని మీకు అనిపించలేదా అని ప్రశ్నించారు.