మీ జీవితాన్ని ప్రేమతో నింపేయండి

ప్రముఖ టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ క్యూట్ గా ఉన్న బుడతడిని ఎత్తుకొని..ఆప్యాయంగా ఆడిస్తున్న ఫొటోను ట్విటర్ లో పోస్ట్ చేశాడు. మీ జీవితాన్ని ప్రేమతో నింపేయండి. నేను ఇష్టపడే పని చేస్తున్నా, ఇష్టపడే క్రీడను ఆడుతున్నాను, ఇష్టపడేదాన్ని తింటాను, త్రాగుతాను,నేను ఇష్టపడే వ్యక్తుల కోసం నా సమయాన్ని కేటాయిస్తున్నా. మీ ప్రేమను గుర్తించి దాని కోసం పని చేయండి అంటూ బుడతని హత్తుకున్న ఫోటోను షేర్ చేశాడు. ఈ ఫొటో అందరినీ ఆకట్టుకుంటుoది. ఇంతకీ విజయ్ ఎత్తుకున్న బుడతడు ఎవరై ఉంటారని ఆలోచనలో ఉన్నారు ఫ్యాన్స్.