గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన సినీ హీరో ప్రిన్స్

వాతావరణ కాలుష్యం పెరుగుతున్న దృష్ట్యా,  కాలుష్య నివారణార్థం రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా, ఇటీవల ప్రముఖ కమెడియన్ ఖయుమ్,  ప్రిన్స్ ను గ్రీన్ ఇండియా చాలెంజ్ కు నామినేట్ చేశారు. దాంతో అ ఛాలెంజ్ ను స్వీకరించిన ప్రిన్స్, ఈరోజు తన ఇంటి వద్ద మొక్కలు నాటారు. అంతేకాకుండా, ఈ ఛాలెంజ్ కు హీరో నాని, భీష్మ సినిమా డైరెక్టర్ వెంకీ కుడుముల, నటుడు అరుణ్ ఆదిత్ లను నామినేట్ చేశారు. అనంతరం ప్రిన్స్ మీడియాతో మాట్లాడుతూ – రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో పాటు సీడ్ గణేష్ అనే కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.