శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం

డెహ్రాడూన్‌: ఢిల్లీ-డెహ్రాడూన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఇవాళ ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రన్నింగ్‌లో ఉన్న రైలు కాన్స్‌రో ఏరియాకు చేరుకోగానే సీ4 బోగీలో మంటలు చెలరేగాయి. ఆ మంటలను గమనించిన ప్రయాణికులు వెంటనే చైన్ లాగడంతో పైలట్ రైలును నిలిపేశాడు. వెంటనే ప్రయాణికులు కిందకు దిగారు. ప్రయాణికులు దిగిన కాసేపటికే రైలు పూర్తిగా మంటల్లో దగ్ధమైపోయింది. కాగా, ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారని, ఎవరికీ ఎలాంటి గాయాలు కూడా కాలేదని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.