గాదె వెంకటేశ్వరరావును ఘనంగా సన్మానించిన నగర కార్యదర్శులు

గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ పేరు బలంగా వినిపిస్తుంది అంటే ముమ్మాటికీ అది గాదె. వెంకటేశ్వరరావు కష్టమే అని చెప్పుకోవాలి.. అధ్యక్షునిగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్న ఆయనను నగర కార్యదర్శులు సూదా నాగరాజు, తోట కార్తీక్, పావులూరి కోటేశ్వరరావు, బండారు రవీంద్ర ఘనంగా సన్మానించారు.. అనంతరం బండారు రవీంద్ర మాట్లాడుతూ.. అధికార పక్షం వారు పవన్ కళ్యాణ్ గారి మీద చేసే విమర్శలు ఘాటుగా తిప్పి కొడుతూ.. ప్రజా వ్యతిరేక విధానాలపై ఇరు పక్షాలపై తీవ్రంగా తనదైన శైలిలో ధీటుగా స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు భవిష్యత్తు లో మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని తెలియజేసారు.