గురుదత్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన గంటా నారాయణమూర్తి

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోటి గ్రామానికి చెందిన వైసీపీ పార్టీ నాయకులు పెద్దలు గంటా నారాయణమూర్తి శనివారం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి, కోరుకొండ మండలం సీనియర్ నాయకులు కోటి జనసేన పార్టీ నాయకులు చదువు ముక్తేశ్వరరావు, చదువు నాగు పాల్గొన్నారు.