క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ చేసిన గర్భాన సత్తిబాబు

పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో
శుక్రవారం యారకరాయపురం గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసైనికులను ఉద్దేశించి మాట్లాడుతూ.. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల చేత గాజు గ్లాస్ గుర్తు పై ఓటు వేయించి జనసేన పార్టీ గెలుపుకు సహకరించాలని, అలాగే గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.