సుధీర్ బాబు ఇంట ఘట్టమనేని ఫ్యామిలీ సందడి

ఘట్టమనేని కుటుంబం అంతా ఓచోట సరదాగా కలిసి గెట్ టుగెదర్ లా కలిసారు. విషయమేంటంటే.. హీరో కృష్ణ కుమార్తె ప్రియదర్శిని పుట్టిన రోజు వేడుకను.. కుటుంబసభ్యులంతా కలిసి గ్రాండ్‌గా సెలబ్రేట్‌చేసుకున్నారు.

హీరో కృష్ణ దంపతులు, మహేష్‌ దంపతులు, ఎంపీ గల్లా జయ్‌దేవ్‌ సహా కుటుంబసభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. ప్రియదర్శినితో కేక్‌ కట్‌ చేయించి.. ఫొటోలకు ఫోజిచ్చారు. తన భార్య పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు సుధీర్ బాబు తన సతీమణి ప్రియదర్శినికి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ఈ రోజు నా జీవితానికి ఒక ప్రేమ పుట్టినరోజు. ప్రియకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని సుధీర్ బాబు ట్వీట్ చేశారు. ఘట్టమనేని కుటుంబం అంతా ఒకే ఫ్రేమ్ లో ఉన్న ఫొటోలు ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోకు విపరీతమైన లైక్స్ వస్తున్నాయి.