వాగులలో ఇసుక తరలించే నాటు బండ్లకు పర్మిషన్ ఇవ్వండి -జనసేన డిమాండ్

నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీర సూర్యచంద్ర అధ్యక్షతన గొలుగొండ నాయకుల సమక్షంలో గొలుగొండ ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సూర్యచంద్ర మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా మండలాల్లో ఇసుక రవాణా చేస్తున్నటువంటి నాటు బండ్లను అధికారులు ఇబ్బంది పెడతా ఉంటే 8 నెలల క్రితం స్థానిక ఎమ్మెల్యే విశాఖ కలెక్టర్ ని కలిసి నాటు బండ్లతో ఇసుక రవాణా చేసే విధంగా కొన్ని సచివాలయాల్లో టోకెన్స్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేసి రవాణాకు ఇబ్బంది లేకుండా చేశారు. కానీ గొలుగొండ మండలంలో నాటు బండ్లతో ఇసుక రవాణా చేసేవారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీని గురించి తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాల్సిఇందిగా ఒక విజ్ఞాపన పత్రం జనసేన తరపున ఎమ్మార్వోకి సంబంధిత అధికారులకు అందించడం జరిగిందని ఈ సమస్య 15 రోజుల్లోగా పరిష్కరించకపోతే నాటుబండ్లపై జీవించే వారితో పెద్ద ఎత్తున జనసేన తరపున ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొలుగొండ నాయకులు రేగుపండ్ల శివ, గండం దొరబాబు, దుంపలుపూడి శివ, సహదేవుడు మాట్లాడుతూ మండలంలో భవన నిర్మాణంపై ఆధారపడి ఉండే సుమారు ఎనిమిది వేల మంది అర్ధాకలితో అలమటిస్తున్న పరిస్థితి ఉందని కావున తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు వీది చక్రవర్తి, గొలుగొండ మండలం నాయకులు రేగుపండ్ల శివ, గండం దొర బాబు, సహదేవుడు, దుంపలపూడి శివ, వాసం వెంకటేష్, మల్లాడి శ్రీను, పాతాళ శివ, గొర్రెపాటి లోవబాబు, బండారు శ్రీనివాస్, గడ్డం వెంకటరమణ, గడ్డం నాగార్జున, మణికంఠ, దాసరి మణికంఠ, దాసరి మురళి, గుమ్మడి నానాజీ, గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.