పోలియో రహిత భారత్ లక్ష్యం: ఆళ్ళ హరి

గుంటురు, ‘నేషనల్ ఇమ్యునైజేషన్ డే’ను పురస్కరించుకుని ఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో రహిత భారత్ లక్ష్యంగా అందరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కల పంపిణీ జరుగుతుందన్నారు. ఈ నెల 4 న గ్రామీణ ప్రాంతాల్లో, 6న పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కల పంపిణీ చేయనున్నారని ఆళ్ళ హరి తెలిపారు.