భయం గుప్పెట్లో గోదావరి ముంపు గ్రామ ప్రజలు

పోలవరం నియోజకవర్గం: విలీనం మండలాలైన వేలేరుపాడు మండలంలో రేపాక గొమ్ము, రుద్రమకోట, నెమలిపేట, గ్రామాల్లో జనసేన పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్ చిర్రి బాలరాజు జనసేన పార్టీ మండల అధ్యక్షులు గణేశుల ఆదినారాయణ ఆధ్వర్యంలో మంగళవారం పర్యటించారు. ఎగువ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు విలీనం మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు, మండలాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం నామమాత్రంగా చర్యలు చేపట్టిందని కనీసం నిత్యవసర వస్తువులను కూడా అందించడంలో విఫలం చెందిందని ఆయన వద్ద గ్రామస్తులు వాపోయారు. అధికారులు మాత్రం హడావుడిగా విలీన ప్రాంతాల్లో పర్యటించి రేషన్ మాత్రమే పంపిణీ జరిగిందే తప్ప కనీసం నిర్వాసితులకు ప్రభుత్వం నుండి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం పరిహారం ఇవ్వకపోవడం మూలంగానే నేటికీ ఈ గ్రామాల్లోనే నివసించడం జరుగుతుందని, గత సంవత్సరం వర్షాలకు గ్రామాల్లో ఉన్న ప్రజలు తమ ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని రాత్రికి రాత్రే ఊళ్ళు ఖాళీ చేసి కొండగుట్టల పైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకునే దుస్థితి నెలకొందని, కనీసం మాకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం ఇస్తే మేము ఈ గ్రామాల నుండి మాకు కేటాయించిన నిర్వాసిత గృహాలకు వెళ్లడం జరుగుతుందని వారు వాపోయారు. ఎక్కువ శాతం జనం ఎప్పటికీ గ్రామాల్లోనే ఉంటూ ఇళ్లల్లో ఉన్న సామాను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఊరికి సుమారు 100 కుటుంబాలను మాత్రమే గ్రామంలో ఉన్నట్లు తెలిపారు కానీ గ్రామంలో 500 కుటుంబాలకు 400 కుటుంబాలు నిర్వాసిత కేంద్రాలకు తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. జనసేన నాయకులు వద్ద వారు తెలిపారు. రుద్రమకోటలో కొవ్వాల బక్కయ్య తమ సమస్యలను జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కు తెలియజేస్తున్నారు. ఈ గ్రామంలో చూసిన నిర్వాసితులకు నామమాత్రంగానే నిత్యవసర వస్తువులు ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయన్నారు. ఇకనైనా ప్రభుత్వాధికారులు నిర్వాసిత కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని, అధికారులు వెంటనే కేటాయిస్తే తాము నివసించే ప్రాంతాల నుండి మాకు కేటాయించిన గృహాలకు గ్రామాలకు వెళ్ళిపోవటం జరుగుతుందని వారు అంటున్నారు. తాగడానికి మంచినీళ్లు సదుపాయం కూడా సక్రమంగా లేకపోవటంతో సతమతమవుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేచినేని సంజయ్, కొవ్వాల క్రాంతి కుమార్, బొద్దాల శివరాం, జనసేన నాయకులు కార్యకర్తలు గ్రామస్తుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు.