శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు

ఇంద్రకీలాద్రిపై ఏడవ రోజుకు దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు చేరుకున్నాయి. ఏడవరోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. లోక కంఠకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవీ స్వయంగా కీలాద్రిపై అవతరించినట్లు ఆలయ చరిత్ర చెబుతుంది. దుర్గతులను పోగొట్టే దుర్గాదేవి అవతారాన్ని దర్శించుకుంటే సద్గతులు సంప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. దుర్గాదేవి దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు.