అభిమానికి గోపీచంద్‌ ఆర్థిక సాయం

ఇప్పటివరకూ ఆపదలో ఉన్న తమ అభిమానులను ఆదుకున్నవారిలో ఎందరో హీరోలు ఉన్నారు. తాజాగా ఆ లిస్టులోకి హీరో గోపీచంద్‌ కూడా చేరారు.  హీరో గోపీచంద్‌ తన అభిమాని కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని అతనికి రెండు లక్షలు ఆర్థిక సాయం అందించి తన మంచి మనసు చాటుకున్నాడు. కరీంనగర్‏కు చెందిన ఓ యువకుడు గోపిచంద్‏కు వీరాభిమాని. ఇటీవల అతడికి కరోనా సోకడంతో చికిత్స కోసం భారీగా అప్పులు చేసాడు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న అభిమాని గురించి తెలియగానే గోపిచంద్ వెంటనే రూ.2 లక్షల చెక్ పంపించారట. తన అభిమాన హీరో చేసిన ఆర్థిక సాయంతో ఆటో కొనుక్కుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అభిమానికి గోపిచంద్ సాయం చేసిన విషయం ఆయన టీం రహస్యంగా ఉంచినా.. సాయం పొందిన వ్యక్తి అందరికీ చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త బయటకు వచ్చింది. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న అభిమానికి సహయం చేసి ఆ విషయాన్ని ప్రచారం చేసుకోకపోవడంతో గోపిచంద్ మరోసారి రియల్ హీరో అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో సిటిమార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‏గా నటిస్తుండగా, కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమయ్యింది.