జగన్‌ని పట్టభద్రులు విశ్వసించలేదు.. తుమ్మగంటి సూరినాయుడు

చీపురుపల్లి: వైకాపా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా పట్టభద్రులు తీర్పు ఇచ్చారని జనసేన నాయకులు తుమ్మగంటి సూరినాయుడు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మన పొగరబోతు సీఎంని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పికి అరేబియా సముద్రంలో పడేసారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంత వ్యతిరేకం ఉందో ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికైనా పొగరబోతు మాటలు మానుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసినదని కోరుతున్నాను. ఈ నాలుగు సంవత్సరం పరిపాలనలో అన్ని రంగాల ప్రజలను మోసం చేసి మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతిని చవి చూసారు. కాబట్టి ఎప్పటికైనా బుద్దు తెచ్చుకొని నిజాయితీగా ప్రజలకు అనుకూలంగా పని చేయవలిసినదిగా కోరుతున్నాను. లేదంటే 2024 ఎన్నికల్లో నీకు తగిన బుద్ది చెప్పడానికి ఏపీ ప్రజలు సిద్దంగా వున్నారని సూరినాయుడు హెచ్చరించారు.