కాశిపురం జంక్షన్ లో ఘనంగా జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

మాడుగుల నియోజకవర్గం: దేవరపల్లి మండలంలో కాశిపురం జంక్షన్ లో ఏర్పాటు చేసిన జనసేన కార్యాలయం ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. జనసేన పార్టీ నాయకులు అంజిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి కె.కోటపాడు మండలం, కె. కోటపాడు జనసేన నాయకులు, జనసైనికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే జిల్లా నుంచి విచ్చేసిన పంచకర్ల రమేష్ బాబుకి ఘన స్వాగతం పలికారు.