పెనమలూరు మండలంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

పెనమలూరు: జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన పుట్టినరోజు సందర్భంగా శనివారం పెనమలూరులో వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వేడుకలలో భాగంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, కేక్ కటింగ్ లు, అనాధాశ్రమంలో అల్పాహారం, స్టేషనరీ భువన కార్మికులతో భోజనాలు నిర్వహించడం జరిగినది. తాడిగాడు మున్సిపాలిటీ తాడిగడపలో బొల్లం వీరన్ కుమార్ ఆధ్వర్యంలో, కానూరు మురళి నగర్ లో వన్నెపు రెడ్డి కృష్ణారావు ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం, జెండా దిమ్మ ఓపెనింగ్, కేక్ కటింగ్ కార్యక్రమాలు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కరీంకొండ సురేష్, పెనమలూరు నాయకులు బొల్లం వీరన్ కుమార్, పాండమనేని శ్రీనివాస్ నేరుసు కృష్ణ ఆంజనేయులు, గరికిపాటి ప్రసాద్, వడ్డీ జీవ, తిరుమల శెట్టి సుధీర్, చెన్న గాంధీ మండల కమిటీ మున్సిపల్ కమిటీ జనసైనికులు, వీరమహిళలు పాల్గొనడం జరిగినది.