ఘనంగా మొగల్తూరు మండల జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభం

నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండల జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ మరియు పార్టీ సీనియర్ నాయకులు డా.చినిమిల్లి సత్యనారాయణ. మొగల్తూరు మండల పార్టీ అధ్యక్షులు కొల్లాటి గోపీకృష్ణ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ పార్టీ పనులు మరింత చాకచక్యంగా చేసుకునేందుకు మండలంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేశాం అని తెలిపారు. అందరూ సమిష్టిగా కృషి చేసి జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పని చెయ్యాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, ఆకన చంద్రశేఖర్, మాధంశెట్టి కోటేశ్వరరావు, నిప్పులేటి తారకరామారావు, దూది బాబు, ఇంజేటి దానం, ఘట్టెం శ్రీను, అయితం చిన్ని, బొక్కా చంటి, లక్కు బాబీ, ఉప్పులూరి రాంబాబు, మేడిధి బాబ్జి, పులపర్తి సూర్యనారాయణ, వనమాలి శ్రీను, అందే దొరబాబు, బందెల ఎలీషా, ముక్కు గిరి, పోలిశెట్టి నళిని, అందే కొండ, దాసరి కృష్ణాజి, గజ్జరపు మురళి, కొత్తపల్లి రాంబాబు, గుండాబత్తుల బాబీ, బొడ్డు త్రిమూర్తులు, తిరుమాని సామోరు, విల్లూరి వెంకటేశ్వరరావు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.