ఘనంగా నెల్లూరు నగర జనసేన కార్యాలయం ప్రారంభం

నెల్లూరు నియోజకవర్గం: నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ లో జనసేన నగర కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జనసైనికులకు అందుబాటులో ఉండేలా ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జనసేన – టిడిపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. గత ఐదేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో గత ఐదేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో రాష్ట్ర అభివృద్ధి ఎక్కడకక్కడ నిలిచిపోయిందన్నారు. పేదల పరిస్థితి దుబ్బరంగా మారిందన్నారు. జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి నేర్పాలన్నారు. ఎన్నికలను జనసైనికులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు కొట్టే వెంకటేశ్వర్లు, ఆలియా, అజయ్ బాబు, కాంతర్, శ్రీకాంత్, ఆనంద్ నగర నాయకులు డివిజన్ ఇంచార్జులు తదితరులు పాల్గొన్నారు.