ఫుల్ స్క్రిప్ట్ నచ్చితేనే తరుణ్ భాస్కర్ కి గ్రీన్ సిగ్నల్

అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి దశాబ్దంకి పైగా అవుతున్న స్టార్ హీరో రేంజ్ ని మాత్రం అందుకోలేకపోయారు. అయితే కెరియర్ ఒకే రకమైన కథలకి స్టిక్ అయిపోకుండా ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథాంశాలతో సినిమాలు చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు. కమర్షియల్, కంటెంట్ బేస్ కథలు రెండూ కూడా చేసుకుంటూ వెళ్తున్నాడు. వెంకీమామా సినిమా ఫుల్ కమర్షియల్ యాంగిల్ లోతెరకెక్కిన సినిమా.

ఈ సినిమాతో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్నాడు. ఇక శివ నిర్వాణ దర్శకత్వంలో చేసిన మజిలీ సినిమాలో పూర్తి ఆపోజిట్ గా నటించాడు. ఇందులో క్రికెట్ లో, జీవితంలో ఓడిపోయిన యువకుడుగా తెరపై అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. మజిలీ సినిమా నటుడుగా అతన్ని మరో మెట్టు ఎక్కిస్తుంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా పూర్తి చేసేశాడు. ఈ సినిమా శేఖర్ కమ్ముల ఫ్లేవర్ తో ఉంటుంది.

అలాగే విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో మొదటి సారి హర్రర్ జోనర్ ని చైతూ టచ్ చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా కోసం చైతన్య మూడుభిన్నమైన పాత్రలలో కనిపిస్తాడని తెలుస్తుంది.

ఇక చైతూ ఏ సినిమా చేసిన పూర్తి కథ సిద్ధం అయిన తర్వాత బౌండెడ్ స్టోరీ నచ్చితేనే సినిమా చేస్తాడు. స్టోరీ లైన్ నచ్చిన కథ ఒకే అనుకున్న తర్వాతనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇప్పుడు దర్శకుడు తరుణ్ భాస్కర్ కి కూడా అదే కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. ఈ దర్శకుడు రీసెంట్ గా చైతన్యకి ఒక స్టోరీ లైన్ నేరేట్ చేశాడు. అది చైతన్యకి ఇంప్రెస్టవ్ గా అనిపించడంతో మొత్తం కథ సిద్ధం చేయమని అతనికి సూచించాడు. కథ సిద్ధం అయిన తర్వాత నచ్చితే సెట్స్ కి వెళ్దామని అతనికి హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది.