జీఎస్టీ పరిహారం విడుదల చేసిన కేంద్రం. తెలుగు రాష్ట్రాలకు నిధులు

రాష్ట్రాలకు కేంద్రం 18వ విడత జీఎస్టీ పరిహారం కింద రూ.4 వేల కోట్లు విడుదల చేసింది. 23 రాష్ట్రాలకు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ పరిహారం వర్తిస్తుంది. 2020 అక్టోబరు నుంచి విడుదల చేస్తున్న ఈ పరిహారం మొత్తం ఇప్పటివరకు రూ.1.04 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏపీకి అదనపు రుణ సౌకర్యం కింద రూ.5,051 కోట్లు మంజూరు చేసింది. స్పెషల్ విండో ద్వారా ఏపీకి రూ.2,306 కోట్లు కేటాయించింది. అటు, తెలంగాణకు అదనపు రుణ సౌకర్యం కింద 5,017 కోట్లు కేటాయించగా, స్పెషల్ విండో ద్వారా రూ.2,027 కోట్లు మంజూరు చేయనుంది.