గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పోడిగించాలి: గుంటూరు జనసేన

గుంటూరు, గత 11 రోజులుగా గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని నల్లమడ రైతులు గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సామూహిక దీక్షలు చేయుచున్నారు. ఈరైతు దీక్షకు జనసేన పార్టీ నాయకులు మద్దతుగా శనివారం సామూహిక దీక్ష చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రైతులు ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. కాని గతంలో అధికారాన్ని చేపట్టిన ప్రభుత్వాలు మాత్రం మొద్దు నిద్ర పోయాయని వెంకట రత్తయ్య అన్నారు. కాని పాదయాత్రలో పర్చూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు అనేక సభలలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించటానికి నిధులు వెంటనే కేటాయిస్తానని చెప్పిన ఈ ముఖ్యమంత్రి నేటికి కూడా కార్యరూపం దాల్చలేదు అంటే రైతులపై కపటప్రేమ చూపుతున్నారని వెంకట రత్తయ్య అన్నారు. గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగింపునకు ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించాలని గుంటూరు జిల్లా కార్యదర్శి సోమరౌతు అనురాధ అన్నారు. మహిళా రైతులు కూడా ఈ సామూహిక దీక్షలో పాల్గొనేందుకు వచ్చినారంటే రైతులకు ఇబ్బందులు ఏవిధంగా ఉన్నాయోనని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని అనురాధ అన్నారు. గుంటూరు పట్టణ ఉపాధ్యక్షులు చింతా రేణుకా రాజు మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ రైతుల ఇబ్బందులను గుర్తించి నల్లమడ రైతులను కాపాడాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని దీని వలన చివరి వరకు నీరు అందక పంటలు పండక రైతులకు సరి అయిన పనులు లేకపోవడం, బ్రతుకు తెరువు కోసం ఇప్పటికి అనేక రకాలుగా రైతులు చితికిపోతున్నారని రేణుకా రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుంటూరు పట్టణ కార్యదర్శులు పావులూరి కోటేశ్వరరావు, బండారు రవీంద్ర, డివిజన్ అధ్యక్షులు గడ్డం రోశయ్య, తోటకూర విజయ్, రాజధాని రైతు నాయకులు అనుమాలు గాంధి, నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్ కోల్లా రాజమోహన్, హరిబాబు, యార్లగడ్డ అంకమ్మ చౌదరి, జాస్తి వీరయ్య చౌదరి, ప్రొఫెసర్ విజయకుమార్, దోప్పలపూడి సుబ్బాయమ్మ, దోప్పలపూడి సీతమ్మ మరియు మహిళలు, రైతులు పలువురు పాల్గొన్నారు.