మహిళపై దాడిని ఖండించిన గునుకుల కిషోర్

  • వైసీపీ సర్పంచ్ పిలుస్తున్నాడు అని పిలిపించి మహిళను వివస్త్రను చేసి కొట్టడం దారుణం
  • అది కూడా వ్యవసాయ మంత్రి ఉన్న అధికార పార్టీ కార్యకర్తలు కావటం సిగ్గు చేటు

సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలంలో మహిళపై వైసీపీ నాయకుల దాడిని ఖండిస్తూ, ఆత్మహత్యా ప్రయత్నం చేసి నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కోలుకుంటున్న బాధితురాలిని మనగళవారం జనసేన జిల్లా ప్రధన కార్యదర్శి గునుకుల కిషోర్ పరామర్శించారు. మంత్రి నియోజకవర్గం చాటగుట్లలో వారి నాయకులు జరిపిన ఈ దాడి సభ్య సమాజం సిగ్గపడేలా ఉంది. సర్పంచ్ తన వాడే అని అహంకారంతో వ్యవహరించిన పెంచలయ్యకు శిక్ష పడే వరకూ బాధితులకు జనసేన తరపున తోడుగా ఉంటాం. పేదల పట్ల కనికరం లేకుండా దాడి చేయటం అమానవీయం, ఒంటరి మహిళలపై ఈ విధంగా దాడి జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.రూపాయలు ₹10000/- అప్పు తిరిగి ఇవ్వకపోతే ఇలా కొట్టమని చెప్పిందా మీ వైసీపీ అధిష్టానం. అది కూడా అక్క బాకీ ఉంటే చెల్లిపై దాడి చేశారు. ఏమి చేసినా చెల్లుతుందా మీ నాయకులకు.? అనాగరికంగా పేద మహిళలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. అధికార మధంతో వ్యవహరిస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజలు ఈసారి సరైన బుధ్ధి చెప్పండి. అన్ని వర్గాల అభివృద్ధి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కే సాధ్యం. ఈ కార్యక్రమంలో కిషోర్, లక్ష్మన్, బలచంద్ర, రాజేష్, శ్రీను, ప్రతాప్, సాయి దీపక్, ప్రశాంత్ గౌడ్, మౌనేష్, వర, బన్నీ తదితరులు పాల్గొన్నారు.