పలు కుటుంబాలను పరామర్శించిన గురుదత్

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, రాజానగరం గ్రామానికి చెందిన జనసైనికుడు మచ్చ శివ నాగు మరియు తన స్నేహితుడు ప్రమాదంలో గాయాలపాలై జి.ఎస్.ఎల్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతున్న వారిని జనసేన పార్టీ తరుపున రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు ఐక్యరాజ్యసమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ పరామర్శించడం జరిగింది. అనంతరం రాజానగరం మండలం, పాత తుంగపాడు గ్రామానికి చెందిన జనసైనికుడు శివ కృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు అనే వార్త స్థానిక జనసేన శ్రేణుల ద్వారా తెలుసుకున్న రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ వారి కుటుంబాన్ని పరామర్శించి అన్ని విధాలుగా జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కో-కన్వీనర్ నాగవరుపు భానుశంకర్, రాజానగరం మండలం యూత్ ఐకాన్ పల్లా హేమంత్, రాజానగరం నియోజకవర్గం వీరమహిళ నంద్యాల లక్ష్మి, మారుకుర్తి శ్రీను, ఆదర్శ్, వాల్లేపల్లి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.