ఘనంగా శ్రీ జోష్విక పుట్టినరోజు వేడుకలు

జనసైనికుల ఆధ్వర్యంలో అమ్మకోట మహేశ్వరి మరియు నాన్న కోట చంగల్ రాయుడు గారాల పట్టి శ్రీ జోష్విక మొదటి పుట్టిన రోజు పండుగ సందర్భం గా శనివారం రైల్వే కోడూరు లోని శ్రీ సాయి ఈశ్వరి అనాధ వృద్ద ఆశ్రమం నందు వృద్ధులందరికీ దుప్పట్లు, తలగడలు మరియు దోమ తెరలను ఇవ్వడం జరిగినది. ఇక్కడ ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీమతి పుష్ప లత మాట్లాడుతూ మనజీవితకాలంలో మనం మన చుట్టూ ఎంతో మంది అభాగ్యులును చివరి దశలో తమ స్వంత బిడ్డల చేత బయటకు నెట్టివేయబడుతున్నారు, ఎంతో మంది అనాధలు ఆకలితో అలమటిస్తు దీనస్థితి లో చనిపోతున్నారు. అలాంటి వారిని చూసినప్పుడు మనసు చలించి పోయేది ఇలాంటి వారి కోసం వారి చివరి రోజులు ఆకలిచావులు కాకూడదని వారికి అన్ని వసుతులతో ప్రశాంత వాతావరణంలో శ్రీ సాయి ఈశ్వరమ్మ ఆశ్రమాని స్థాపించడం జరిగినది. గతంలో రోడ్డు పక్కన చనిపోయే స్థితిలో ఉండే ఒక వృద్దు రాలిని జనసైనికులు ఇక్కడ చేర్పించడం జరిగింది. ఆమె రెండున్నర సంవత్సర కాలంపాటు జీవించింది. తరుచుగా జనసేన పార్టీ లోని యువకులు వచ్చి తమకి తోచిన సాయంను ఇక్కడ వృద్దులుకి చేస్తుంటారు.. ఇలాంటి మంచి సేవా దృక్పథం అలవరిచిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు అని తెలియజేశారు. ఈ సేవా కార్యక్రమంలో జనసేన పార్టి దళిత నాయుకులు నగిరిపాటి మహేష్, జనసైనికులు
విశ్వనాథ్, హరీష్, ఆకాష్, అనిరుద్ మరియు మని పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *