ఏఆర్‌ రెహమాన్‌కి కోర్టు నోటీసులు

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కి మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఐటీ శాఖకు పన్ను కట్టని కారణంగా ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఇంగ్లండ్‌కి చెందిన ప్రముఖ కంపెనీ నుంచి తీసుకున్న 3.47కోట్లకు సంబంధించి రెహమాన్ ఆదాయపు పన్ను చెల్లించలేదని ఐటీ శాఖ ఆరోపించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఐటీ శాఖ ఆరోపణలకు బదులివ్వాలంటూ న్యాయస్థానం నోటీసుల్లో పేర్కొంది.