రైతు ఉత్పత్తి దారుల సంఘాలతో అధిక ప్రయోజనాలు

ఎస్.కోట, నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి టి నాగార్జున ఎస్.కోట రైతు భారత్ ఎఫ్ఈఓ ను సందర్శించడం జరిగింది. గ్రామంలో పాలకేంద్ర వద్ద జరిగిన ఈ సమావేశంలో నాగార్జున ప్రసంగిస్తూ రైతులందరి యొక్క అవసరాలు ఆవేదనలు తీరాలంటే రైతు ఉత్పత్తి దారుల సంఘాలు ఒకటే దానికి ఏకైక మార్గమని, ఒకరిగా చేయలేని పని సంఘంగా కలిపి చేయవచ్చునని రైతులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా రైతు ఉత్పత్తి దారుల సంఘం ఏర్పాటును నాబార్డు మరియు భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ సబల సంస్థ ద్వారా చేయడం జరిగిందని తెలిపారు. ఎఫ్ఈఓలో సభ్యుల సభ్యత్వాన్ని పెంచి, ఎఫ్ఈఓ అభివృద్ధి చేస్తే సభ్యుల వేతనానికి సమానంగా ప్రభుత్వం కూడా రివాల్వింగ్ ఫండ్ రూపంలో నిధులు సమకూర్చడం జరుగుతుందని, దీని ద్వారా మన రైతు యొక్క అవసరాలన్నీ కూడా తీర్చుకోవడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ లోకల్ లో సభల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సభల సంస్థ కార్యదర్శి సరస్వతి మాట్లాడుతూ రైతులందరూ ఐక్యంగా ఉండి ఏ కార్యక్రమాలైనా సరే సాధించుకోవచ్చని ముఖ్యంగా రైతు ఉత్పత్తిదారులు సంఘాల ద్వారా రైతులందరూ సమైక్యంగా ముందుకు వచ్చి రైతులకు కావలసినటువంటి అనేక సాంకేతిక నైపుణ్యాలను కూడా సాధించుకోవచ్చని, ప్రభుత్వం కూడా వ్యవసాయ శాఖ ద్వారా మరియు అన్ని వివిధ రకాల డిపార్ట్మెంట్ల ద్వారా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నదని తెలియజేశారు. అదేవిధంగా ఎస్.కోట రైతుబంధు ఎఫ్ఈఓ డైరెక్టర్ వబ్బిన సన్యాసినాయుదు కూడా మాట్లాడుతూ.. రైతులకు ఎంతో మేలు జరగడానికి ప్రభుత్వం సంకల్పించిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు సభ్యుడు ఉపయోగించుకొని, గ్రామాలను అభివృద్ధి చేసుకొని ముందు ముందు తరాలలో రైతు, వ్యవసాయం అంతరించిపోకుండా ఉండడానికి ఈ అవకాశాన్ని వాడుకుంటూ ముందుకెళ్లాలని రైతులందరూ అభివృద్ధి చేసేవిధంగా పనిచేస్తున్న రైతు ఉత్పత్తి దారుల సంఘాలు ఎన్నో మా ముందు ఉదాహరణలుగా ఉన్నాయని, మన చుట్టుపక్కల మండలంలో కూడా ఎన్నో ఉత్పత్తి దారుల సంఘాల ద్వారా సాధిస్తున్న ప్రగతిని మనం కూడా వెళ్లి చూసి ఆ విషయాలు తెలుసుకొని ముందుకెళ్లగలిగితే ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క సభ్యుడు కూడా అభివృద్ధి చేసుకోవచ్చని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో నాబార్డు నాగార్జునతో పాటుగా ఎస్.కోట రైతు భారతీయ ప్రెసిడెంట్ బత్తుల వెంకటరావు, వైస్ ప్రెసిడెంట్ రామ నాయుడు, అదే విధంగా రైతు విశాఖ డైరీ పిఎస్ వెంకటరమణ మొదలైన వారు పాల్గొని ఈ సమావేశంలో పాల్గొన్న రైతులందరికీ కూడా అందరూ కలిసికట్టుగా ముందు రావాలని పిలుపునివ్వడం జరిగింది.