అతని ప్రేమకు అవధుల్లేవు

మెగావారి ఇంట పెళ్లి సందడి మొదలైంది. మెగా డాటర్ నిహారిక పెళ్లికి ఇక రెండు రోజులే ఉండడంతో అన్ని హంగులు పూర్తయ్యాయి. ఇప్పటికే కుటుంబ సభ్యులు రాజస్థాన్‌లో పెళ్లి వేడుక జరిగే ఉదయపూర్ ప్యాలెస్‌కు చేరుకొని పెళ్లి పనులు మొదలుపెట్టారు. మొన్న శనివారం రోజున కార్తీక బహుళ పంచమి శుభ దినం కాబట్టి.. నిహారికను పెళ్లి కూతురుని చేసిని సంగతి తెలిసిందే. అందులో భాగంగా ముందుగా సాంప్రదాయం ప్రకారం మంగళ స్నానాలు చేయించారు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత పెళ్లి కూతురిని చేసారు. ఈ సందర్భంగా ఆమె ముప్పైరెండు సంవత్సరాల క్రితం తన తల్లి కట్టుకున్న చీరనే నిహారిక మరోసారి ధరించింది. దీనికి సంబందించిన ఓ ఫోటోను కూడా తన సోషల్ మీడియాలో పంచుకుంది. పెళ్లి కూతురు అయిన సందర్భంగా నిహారిక తన పెదనాన్న చిరంజీవి ఆశీర్వాదం తీసుకుంది. అంతేకాదు ఓ సెల్ఫీని కూడా తీసింది. ఆ ఫోటోల్లో నిహారిక, చిరంజీవి మెరిసిపోతున్నారు. అయితే దీనికి సంబందించిన ఓ ఫోటోను నిహారిక తండ్రి నాగబాబు తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్’స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ సందర్భంగా నాగబాబు చిరంజీవని ఉద్దేశిస్తూ.. అతని ప్రేమకు అవధుల్లేవు, అతని చిరునవ్వు ప్రతి సందర్భాన్ని ఒక వేడుకగా మారుస్తుంది అంటూ ఎమోషన్ అవుతూ ఓ పోస్ట్ పెట్టారు. దీంతో ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్’గామారింది.