దేవిశ్రీ ప్రసాద్ కు ఐకాన్ స్టార్ సర్ ప్రైజ్ గిఫ్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లో మంచి స్నేహశీలి ఉన్నాడు. ఒకసారి తన సర్కిల్ లోకి ఎవరైన వచ్చి దగ్గరైతే, ఇక వారి కోసం ఏమైనా చేస్తాడు బన్నీ! అతని స్నేహబృందం అందుకే రోజు రోజుకూ విస్తరిస్తూ ఉంటుంది. ఇక తన చిత్రాలకు పనిచేసే సాంకేతిక నిపుణులతో అల్లు అర్జున్ వ్యవహరించే తీరు సమ్ థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. వాళ్ళకు నచ్చే, వాళ్ళు మెచ్చే గిఫ్ట్ లను ఇచ్చి సర్ ప్రైజ్ చేయడం అల్లు అర్జున్ కు అలవాటు. తాజాగా అలాంటి స్వీట్ సర్ప్రైజ్ ను ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కు ఇచ్చాడు.

బన్నీ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ను ఎంతో ఆనందంగా దేవిశ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. అంతేకాదు. బన్నీకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ‘ఆర్య’ సినిమాతో మొదలైన అల్లు అర్జున్, దేవిశ్రీ ప్రసాద్ సినీ సంగీత ప్రయాణం సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ‘బన్నీ, ఆర్య 2, జులాయి, ఇద్దరమ్మాయిలతో, సన్నాఫ్ సత్యమూర్తి, డి.జె. దువ్వాడ జగన్నాథం’ చిత్రాలకు సంగీతం అందించిన డి.ఎస్.పి. తాజాగా అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్ ‘పుష్ప’కు మ్యూజిక్ అందిస్తున్నాడు.