జగనన్న ఇల్లు నిర్మాణ పనులు పూర్తి చేయకుంటే ఉద్యమిస్తాం.. జనసేన

  • స్థానిక వైసీపీ నాయకులు సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు పరిచయం చేసి ఇల్లు కట్టించి ఇస్తాడన్న కాంట్రాక్టర్ ఇప్పటిదాకా పూర్తి చేయలేదు

నాన్న గారి పేరుతో ట్రస్ట్ ఓపెన్ చేసి ఒక పది మందికి సహాయం చేసి నియోజకవర్గం మొత్తాన్ని ఉద్ధరించాలని అనుకుంటున్నాడు ఎమ్మెల్యే ప్రసన్న గారు నియోజకవర్గంలో పేదలకు పెత్తందారులకు క్లాస్ వారు నడుస్తుంది.. అంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, బుచ్చి మండల ఇన్చార్జి మాధవ్, జిల్లా ఉపాధ్యక్షులు సుధీర్ బద్దెపూడి తో మరియు హౌస్ ఫర్ ఆల్ బాధితులతో బాధితులతో నిరసన చేపట్టారు. కోవూరు నియోజకవర్గం, నాగమాంబ పురం, కొట్టాలం గ్రామం. సచివాలయం సెక్రటరీకి మరియు ఎంపీపీ ఆఫీసులో అధికారులకు బాధితులకు తోడుగా నిలవాలని, వారికి సకాలంలో కట్టించేటట్లు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసారు.. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ప్రసన్న నిర్లక్ష్యం వలనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. గడపగడపకు తిరిగిన ఆయనకు ఏ ఊర్లో లబ్ధిదారులకు ఇల్లు అందలేదు, వారి కనీస అవసరాలు ఎందుకు తీర్చలేకపోయాము, అని ఆలోచించే సమయం లేకుండా పోయింది కేవలం ఓట్లు అడిగితే సరిపోతుందని అనుకుంటున్నారేమో. నియోజకవర్గంలో సహజ సంపద ఎంత దోపిడీ అవుతున్నా చూస్తూ ఊరుకోవడం అలవాటైపోయింది. నాలుగు సంవత్సరాల ముందు జగనన్న పేరుతో ఇల్లు ఇచ్చి ప్రభుత్వం తరఫున వచ్చే అమౌంట్ ఇస్తే పలానా కాంట్రాక్టరు కు ఇస్తే మీకు ఇళ్ళు కట్టిస్తారని చెప్పి వైసీపీ నాయకులు, సచివాలయ సెక్రటరీ, ఎంపీపీ సిబ్బంది పరిచయం చేసిన కాంట్రాక్టర్ అందుబాటులో లేడు. బాధితులకు వచ్చిన మొత్తాన్ని కాంట్రాక్టర్ ఇచ్చినా కూడా ఇల్లు పూర్తి చేయకుండా ఇబ్బంది పెట్టడం సరైన పద్ధతి కాదు. బాధితులకు వచ్చిన మొత్తాన్ని కాక అదనపు సౌకర్యాలు కోసం ఒక్కొక్క దాదాపుగా మూడు లక్షల కట్టినా వారికి కూడా సమాధానం చెప్పకపోవడం బాధాకరం. ఇప్పుడే కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి బాధితులు బెదిరించటం తప్పు,రెండు నెలలు లోపల మీరు ఇల్లు కట్టి ఇవ్వకపోతే మీ పై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని తెలపటం జరిగింది. ఇక్కడ సర్పంచి ఉన్నా లేనట్టే అధికారం మొత్తం వైసిపి పార్టీ పెద్దలదే స్థానికులది ఏమీ ఉండదు. ఎన్నోసార్లు అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. శుక్రవారం సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయడం జరిగింది. బడుగు బలహీనవర్గాలు, పేదలు ఎక్కువగా ఉన్న కోవూరు నియోజకవర్గ అభివృద్ధి పడాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాల్సిందే అని తెలిపారు. అందుకే హలో ఏపీ బై బై వైసిపి అని నినాదాన్ని ప్రజలందరూ గమనించాలని తెలిపారు. కాంట్రాక్టర్ వారం రోజుల లోపల పనులు ప్రారంభించి రెండు నెలల లోపల లబ్ధిదారులకు అందించకపోతే జనసేన పార్టీ తరఫున బాధితులకు అండగా నిలబడి న్యాయం జరిగే వరకు కూడా తోడుంటాం..అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ జిల్లా ఉపాధ్యక్షులు సుదీర్ బద్దిపూడి, బుచ్చి మండల ప్రెసిడెంట్ మాధవ్, సురేష్, అభి అవినాష్ సాయి సుధీర్ అనిల్ సాయి, షారు, కాసిఫ్, నిమ్మలపల్లి రామ చైతన్య, నాయబ్, రమణ, దుర్గ, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.