భయపెట్టడమే రాజకీయం అనుకుంటే- ప్రజలు మీకు రాజకీయ సమాధి కడతారు

నెల్లూరు: భయపెట్టడం, బేదిరించడమే రాజకీయం అనుకునే వైసీపీ నాయకులకు ప్రజలు రాజకీయ సమాధి కడతారని ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ రావు అన్నారు. చిట్టమూరు మండలం మొలకలపూడి గ్రామంలో బుధవారం ఎన్డీఏ అభ్యర్థుల విజయం కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయం ఖరారు కావడంతో వైసిపి నాయకులు చేస్తున్న ఉడత బెదిరింపులకు జనసైనికులు ఎవరు భయపడరన్నారు. వాకాడు, కోట, చిట్టమూరు మండలాల్లో వైసిపి నాయకులు భయపెట్టేందుకు బెదిరిస్తే, భయపడేందుకు వారేమీ వైసిపి పేటిఎంబ్యాచ్ కాదని పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో నిండిన జనసైనికులు అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన సౌలభ్యంతో నచ్చిన పార్టీ జెండాను చేతబట్టి ప్రచారం చేసుకోవడంతో పాటు, నచ్చిన పార్టీకి ఓట్లు వేసుకొనే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, గ్రామాల్లో వైసిపి నాయకులు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయాలని చూస్తే, చూస్తూ ఊరుకోబోమన్నారు. ప్రతి ఒక్కరూ స్వేచ్చగా ఈసీ నిబంధాలను అనుసరిస్తూ ప్రచారం చేసుకోవడంతో పాటుగా ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరారు. టిడిపి సీనియర్ నాయకులు యదనపర్తి రాజా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ జరగబోయే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ రావడం ఖాయమని, తిరుపతి ఎంపీగా ఉమ్మడి అభ్యర్థి వెల్గపల్లి వరప్రసాద్ రావు కు కమలం గుర్తు పై, ఎంఎల్ఏ పాశం సునీల్ కుమార్ కు సైకిల్ గుర్తు పై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగు మండల తెలుగు యువత అధ్యక్షులు దొద్దగా వెంకట రమణ,వెంకటేశ్వర్లు, బీజేపీ శరత్ చంద్ర రెడ్డి, రమణయ్య, జనసేన నాయకులు క్రాంతి , బాలు, శివ, అక్బర్, వేణు, వంశి, రాము, శేఖర్, జోనేష్, శ్రీను, ఇలియాజ్, సాయి, దినేష్, వంశీ, ముత్తు, శ్రీను, సురేష్, చందు, సూర్య పాల్గొన్నారు.