అక్రమ ఇసుక తవ్వకాలు వెంటనే నిలిపివేయాలి – జనసేన అధ్వర్యంలో ధర్నా

ఉమ్మడి గుంటూరు బాపట్ల జిల్లా, వేమూరు నియోజకవర్గం, కొల్లూరు మండలం, కొల్లూరు కరకట్టపై ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేయాలని శుక్రవారం జనసేన పార్టీ అధ్వర్యంలో ధర్నా కార్యక్రమంను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి సోమారౌతు అనురాధ మాట్లాడుతూ.. నెల రోజులుగా అధికారులకి వినతి పత్రాలు ఇస్తున్నా పట్టించుకొక పోవటంతో ప్రజల పక్షాన ధర్నా కార్యక్రమం నిర్వహించామని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ ఇసుక తవ్వకాలని నియంత్రించాలి, లేకుంటే తమ ధర్నా కొనసాగుతుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జేపీ వెంచర్ కి ఇచ్చిన లీజూ గడువు ముగిసినా ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారని, ఎవరి ప్రోద్బలంతో జరుగుతుందో ప్రజలకి తెలియాలి అని కోరుతున్నమని అన్నారు. కొల్లూరు మండల జనసేన అధ్యక్షుల బొందలపాటి చలమయ్య మాట్లాడుతూ.. కోర్టు సైతం జేపీ పవర్ వెంచర్ ని ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి అని ఆదేశాలు ఇచ్చి 18 కోట్లు రూపాయలు జరిమానా కూడా విధించిందినా ఈ ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయని, అధికారులు తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.