స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ నందు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాధ్

మార్కాపురం పట్టణం నందు మాయులూరి రామయ్య ఆధ్యర్యంలో స్ఫూర్తి వెల్ఫేర్ సొసైటీ నందు మానసిక వికలాంగులకు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జి ఇమ్మడి కాశీనాధ్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. స్ఫూర్తి కేంద్రంలోని వికలాంగులకు ఇమ్మడి కాశీనాధ్ అన్నం వడ్డించి, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపుం మండల అధ్యక్షులు తాటి రమేష్, జానకి రామ్, పుల్లయ్య, వెంకటరావు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.