ది మార్కాపురం ఎనామిల్ స్టేట్ ఆపరేటర్స్, వర్కర్స్ యూనియన్ సమావేశంలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాథ్

మార్కాపురం పట్టణంలోని అతిపెద్ద పలకల ఇండస్ట్రీ ది మార్కాపురం ఎనామిల్ స్టేట్ ఆపరేటర్స్ మరియు వర్కర్స్ యూనియన్ యొక్క ముఖ్య సమావేశం ఆదివారం 11 గంటలకు జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ కార్యాలయం నందు జరిగినది. ఈ సమావేశంలో కార్యవర్గ సభ్యులు రాబోయే సమ్మె గురించి తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను యూనియన్ అధ్యక్షులు అయిన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాథ్ దృష్టికి తీసుకొని వచ్చారు. ఇమ్మడి కాశీనాథ్ యూనియన్ వారికి తగు సూచనలు సలహాలు ఇస్తూ ఇండస్ట్రీ మీద ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా వేలాది మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నందున ఎనామిల్ ఫ్యాక్టరీల యాజమాన్యాన్ని సమ్మె గడువులోపు చర్చలకు ఆహ్వానించవలసినదిగా కార్యవర్గ సభ్యులను ఆదేశించారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటల సమయం కొనసాగింది.