ద్వారకా నగర్ లో సమాజానికి మీరే గౌరవం కావాలి మాకు మీ అనుభవం

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో కాకినాడ సిటిలోని సీనియర్ సిటిజన్స్ ని గౌరవించుకుని వారి అనుభవ పాఠాలతో సూచనలు కోరుతూ సమాజానికి మీరే గౌరవం కావాలి మాకు మీ అనుభవం కార్యక్రమం రావిపాటి వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 44వ ద్వారకా నగర్ శారదమ్మ గుడి ప్రాంతంలో జరిగింది. సమాజంలో వివిధరకాల వయసులవారు ఉంటారనీ, చిన్న వయసు పిల్లలకు పెద్దవారు తమ అనుభవాల సారాన్ని చెప్పి వారికి మార్గనిర్దేశం చేయడం మన సంస్కృతి ఆన్నారు. సీనియర్ సిటిజన్స్ ని గౌరవించుకోడం మన సాంప్రదాయమన్నారు. ఇందులో భాగంగా నగరంలో వీరిని కలిసి ఆశీర్వాదాలు తీసుకుని జనసేన పార్టీకి వీరియొక్క సలహాలు, సూచనలను అందించవలసినదిగా కోరారు. సమాజంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న అసమానతలను రూపుమాపేందుకు వీరి అనుభవంతో మెరుగైన మార్గాన్ని జనసేన పార్టీకి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి అందించవలసినదిగా పోస్టల్ కవర్లను అందచేస్తూ కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి సీతారాం, చూడపునిడి రామ సతీష్ తుమ్మలపల్లి వీరభద్రరావు దేవర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.