జగనన్న కాలనీలలో – కష్టాల పాలవుతున్న సామాన్య ప్రజలు

తిరుపతి, జగనన్న కాలనీల పేరుతో తిరుపతి వాసులకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో త్రాగునీరు, కరెంటు, రోడ్లు కనీస వసతులు లేని వద్ద సామాన్య ప్రజలకు ఇళ్ళు ఇచ్చి ఉపయోగం లేదని వారు పడుతున్న కష్టాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, పి.ఎ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు శనివారం తిరుపతి నియోజకవర్గ నాయకులు, వీరమహిళలు, కమిటీ సభ్యులతో కలిసి నగర అధ్యక్షులు రాజారెడ్డి జగనన్న కాలనీలలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ప్రపంచానికి తెలిసే విధంగా సోషల్ మీడియా మాధ్యమాలలో సంబంధిత ఫోటోలను చిత్రీకరించి పోస్టులు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర, జిల్లా, పట్టణ నాయకులు ఆకేపాటి సుభాషిని, కీర్తన, వనజ, వీరమహిళలు లక్ష్మీ, దుర్గ, అరుణ, హేమ కుమార్, కొండా రాజమోహన్, రాజేష్ ఆచారి, కృష్ణయ్య, మునస్వామి, గుట్ట నాగరాజు, కిషోర్, రమేష్ నాయుడు, ఆనంద్, బాటసారి, షరీఫ్, ఆది కేశవులు, పవన్, పురుషోత్తం, సాయి, రమేష్, హిమవంత్, డోలా కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.