చిన్ననాటి స్నేహితురాలి ప్రేమలో

ఓవైపు కరోనా వైరస్ అని కంగారు పడుతున్నా.. మరోవైపు లేకలేక దొరికిన ఖాళీ సమయాన్ని కెరీర్‌లో ముఖ్య ఘట్టాలకు కేటాయిస్తున్నారు టాలీవుడ్ యంగ్ హీరోలు. ముందుగా నిఖిల్, నితిన్‌లు, నిర్మాత దిల్ రాజు పెళ్లిపీటలెక్కగా.. ఇటీవల రానా సైతం కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఇంకా మెగా డాటర్ నిహారిక నిశ్చితార్థం జరిగింది. తాజాగా ఇప్పుడు శర్వానంద్ పెళ్లి వంతు వచ్చింది.

ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగిన శర్వానంద్ ‌కు తన లైఫ్ పార్టనర్ దొరికేసిందని టాక్ వినిపిస్తోంది. చిన్ననాటి స్నేహితురాలితో నటుడు శర్వానంద్ ప్రేమలో ఉన్నాడని.. త్వరలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నాడని సమచారం. శర్వా ప్రేమించిన అమ్మాయి వ్యాపారవేత్త అని ప్రచారం జరుగుతోంది. చిన్ననాటి నుంచే పరిచయం ఉన్న అమ్మాయి కావడంతో శర్వానంద్‌ ప్రేమలో పడ్డాడని, త్వరలోనే ఈ విషయాన్ని తెలుపుతాడని టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఉపాసన ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అని కూడా విషయం వైరల్ అవుతోంది.