సర్వేపల్లిలో జనంకోసం జనసేన 10వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం తాళ్లపూడి పంచాయతీలోని గిరిజన కాలనీ నందు 10వ రోజు శుక్రవారం జనంకోసం జనసేన కార్యక్రమాన్ని సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు బొబ్బేపల్లి సురేష్ నాయుడు నిర్వహించడం జరిగింది. జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన, అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఆంధ్రుల అన్నపూర్ణమ్మ డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా గిరిజనులకి బియ్యం, బెడ్ షీట్లను జనసేన పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా వెనుకబడిన కులాలలో ఒకటైన గిరిజనులకి జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. తాళ్లపూడి పంచాయతీని రాష్ట్రంలో రూ.కోట్ల రూపాయల అవినీతి చేసి ఏ2 ముద్దాయిగా పేరుపొందిన విజయసాయి రెడ్డి సొంత గ్రామం. ఈ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకున్నాడే గాని ఇప్పటివరకు కూడా ఈ గ్రామ పంచాయతీని ఏ విధంగా కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. అయ్యా విజయసాయి రెడ్డి మీరు మర్చిపోయారేమో మళ్లీ మేము గుర్తు చేస్తున్నాం. మీరు దత్తత తీసుకున్న గ్రామాన్ని గ్రామపంచాయతీ అని అభివృద్ధి చేయండని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల సీనియర్ నాయకులు రహీం, శ్రీహరి, ఫణి బాబు, వినాయ్ తుల్ల, నవీన్ తదితరులు పాల్గొన్నారు.